Pushpa 2 Collections : రిలీజ్ కి ముందే కలెక్షన్స్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డ్.. ఇక రిలీజ్ అయ్యాక ఎన్ని వందల కోట్లు వస్తాయో..

లీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది.

Pushpa 2 Collections : రిలీజ్ కి ముందే కలెక్షన్స్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డ్.. ఇక రిలీజ్ అయ్యాక ఎన్ని వందల కోట్లు వస్తాయో..

Allu Arjun Pushpa 2 Movie Creates New Record in Collections Before Release

Updated On : December 3, 2024 / 9:07 PM IST

Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 హవా అమలాపురం నుంచి అమెరికా దాకా ఉంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేస్తుండటంతో ఇప్పటికే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా అవుతున్నాయి.

Also Read : Chiranjeevi – Nani : వావ్.. నాని నిర్మాణంలో మెగాస్టార్ సినిమా.. చిరు మోస్ట్ వైలెంట్ ఫిలిం అంటూ అనౌన్స్..

ఇండియాలోనే కాక అమెరికా, వేరే దేశాల్లో కూడా పుష్ప 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. రిలీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది. ఇప్పటికే కేవలం అమెరికాలోనే 2 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

Pushpa 2 Collections

ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా రిలీజ్ కి ముందే ఏకంగా 100 కోట్లు రావడంతో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2. ఈ లెక్కన మొదటి రోజు ఈజీగా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తుందని తెలుస్తుంది. పుష్ప హవా చూస్తుంటే 1000 కోట్లు ఈజీగా మొదటి వీకెండ్ లోపే వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్. రిలీజయ్యాక కలెక్షన్స్ విషయంలో ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.