Allu Arjun : అల్లు అర్జున్ కి స్పెషల్ పెయింట్ గిఫ్ట్ ఇచ్చిన లేడీ అభిమాని.. వీడియో వైరల్..

తాజాగా ఓ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ లేడీ అభిమాని గీత్ గుప్తా బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.(Allu Arjun)

Allu Arjun : అల్లు అర్జున్ కి స్పెషల్ పెయింట్ గిఫ్ట్ ఇచ్చిన లేడీ అభిమాని.. వీడియో వైరల్..

Allu Arjun

Updated On : September 14, 2025 / 6:06 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. తాజాగా ఓ ఆర్టిస్ట్, అల్లు అర్జున్ లేడీ అభిమాని గీత్ గుప్తా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.(Allu Arjun)

ఆర్టిస్ట్ గీత్ గుప్త తాజాగా అల్లు అర్జున్, అల్లు అర్హ పెయింట్స్ వేసి అల్లు అర్జున్ కి గిఫ్ట్ ఇచ్చింది. అనంతరం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కొంత సమయం గడిపింది. అల్లు అర్జున్ ఆ పెయింట్స్ ని చూసి చాలా బాగున్నాయి అంటూ అభినందించారు. గీత్ గుప్తా అల్లు అర్జున్ ని కలిసి తాను గీసిన పెయింట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Shivani Nagaram : ‘లిటిల్ హార్ట్స్’ హీరోయిన్ లవ్ స్టోరీ.. పాపం.. ఈమె వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా?

ఈ వీడియో షేర్ చేసి.. అల్లు అర్జున్ కేవలం స్క్రీన్ మీద సూపర్ స్టార్ మాత్రమే కాదు బయట కూడా చాలా స్వీట్ పర్సన్. దయ, మానవత్వం గల వ్యక్తి. అంత స్టార్ డమ్ తో అలా సింపుల్ గా ఉండటం గ్రేట్. ఆయన చూపించిన ఆప్యాయత, మంచితనానికి ధన్యవాదాలు. ఆయన ఎప్పటికీ ఒక ఇన్‌స్పిరేషన్ అని తెలిపింది గీత్ గుప్తా. దీంతో ఈ వీడియోని బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.