Allu Arjun – Basil Joseph : మలయాళం స్టార్ హీరో డైరెక్టర్ గా.. అల్లు అర్జున్ తో సూపర్ హీరో సినిమా?
తాజా రూమర్ బన్నీ ఫ్యాన్స్ ని సంతోషపరుస్తుంది.

Allu Arjun will do a Film under Malayalam Star Basil Joseph Rumors goes Viral
Allu Arjun – Basil Joseph : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండగా అది కాస్త ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బన్నీ సినిమా ఒకటి అనౌన్స్ చేసారు. ఈ రెండు సినిమాలు తప్ప బన్నీ చేతిలో ఇంక సినిమాలేమి లేవు. పుష్ప 3 అనౌన్స్ చేసారు కానీ అది ఉంటుందో, ఉండదో క్లారిటీ లేదు. స్టార్ హీరోలందరూ భారీ లైనప్స్ తో దూసుకుపోతుంటే బన్నీ చేతిలో మాత్రం రెండు సినిమాలే అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఈ క్రమంలో తాజా రూమర్ బన్నీ ఫ్యాన్స్ ని సంతోషపరుస్తుంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా తర్వాత మలయాళం హీరోతో సినిమా చేయబోతున్నాడట. మలయాళం హీరో బసిల్ జోసెఫ్ తెలుగులో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. జయజయజయ జయహే, పోన్ మెన్, మరణమాస్, సూక్ష్మదర్శిని.. లాంటి పలు మలయాళం సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. బసిల్ జోసెఫ్ సినిమా అంటే సూపర్ హిట్ అని మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు.
Also Read : Sunjay Kapoor : హీరోయిన్ మాజీ భర్త మరణం.. తేనెటీగ మింగితే అది కుట్టి హార్ట్ ఎటాక్ వచ్చిందట..
అయితే బసిల్ జోసెఫ్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. బసిల్ జోసెఫ్ ఇప్పటికే మూడు సినిమాలు డైరెక్ట్ చేసాడు. అందులో మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ తో చేసిన మిన్నల్ మురళి పెద్ద హిట్ అయింది. సూపర్ హీరో నేపథ్యంలో ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అల్లు అర్జున్ .. బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని రూమర్ తెగ వైరల్ అవుతుంది. అది కూడా సూపర్ హీరో నేపథ్యంలో ఉండే సినిమా అని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ కి కథ చెప్పాడని, అల్లు అర్జున్ డెసిషన్ కోసం వెయిటింగ్ అని సమాచారం.
అయితే బసిల్ జోసెఫ్ మలయాళం నేటివిటీకి తగ్గట్టు రూటెడ్ గా సినిమాలు తీస్తాడు. ఇప్పటివరకు బసిల్ జోసెఫ్ నటుడిగా, దర్శకుడిగా చేసిన సినిమాలు అన్ని చిన్న బడ్జెట్ లు భారీ విజయాలే. బసిల్ జోసెఫ్ కమర్షియల్ కంటే కూడా కథకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. మరి అలాంటి బసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ స్టార్ డమ్, కమర్షియల్ వ్యాల్యూస్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తాడా? తీస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ కి మల్లు అర్జున్ గా మలయాళం లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది కాబట్టి వీరిద్దరి కాంబో మలయాళంలో కూడా పెద్ద సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది నిజమైతే బాగుండు అని బన్నీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also See : Kirrak Seetha : బేబీ, బిగ్ బాస్ ఫేమ్ ‘కిరాక్ సీత’ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?