Hari Hara Veera Mallu : హరిహరవీరమల్లు షూటింగ్ అండ్ రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఎప్పుడో తెలుసా..?

పవన్ సినిమాలు అన్నిటికంటే ముందు చిత్రీకరణ మొదలుపెట్టుకొని ఇంకా షూటింగ్ పూర్తి చేసుకొని హరిహరవీరమల్లు షూటింగ్ అండ్ రిలీజ్ పై నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చాడు.

Hari Hara Veera Mallu : హరిహరవీరమల్లు షూటింగ్ అండ్ రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఎప్పుడో తెలుసా..?

AM Rathnam gave clarity on shooting and release of Pawan Kalyan Hari Hara Veera Mallu

Updated On : August 7, 2023 / 5:52 PM IST

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక పక్క రాజకీయ టూర్స్, మరో పక్క సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే తన చేతిలో ఉన్న బ్రో (Bro) సినిమాని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేసిన పవన్.. ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ పై కూడా దృష్టి సారించనున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG, హరిహరవీరమల్లు సినిమాలు వరుసలో ఉన్నాయి. అయితే వీటిలో ముందుగా OG షూటింగ్ పూర్తి చేయనున్నాడని సమాచారం.

Allu – Mega Family : మొన్న బన్నీ, ఇప్పుడు అల్లు అరవింద్.. ఆ రూమర్స్‌కి మరోసారి గట్టి కౌంటర్..

ఆ చిత్రానికి మరికొన్ని రోజులు కేటాయిస్తే చాలు పవన్ కి సంబంధించిన చిత్రకరణ మొత్తం పూర్తి కానుంది. ఇక ఆ మూవీ తరువాత పవన్ ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నాడని సందేహం మొదలైంది. అసలు పవన్ ఈ చిత్రాలు అన్నిటికంటే ముందు హరిహరవీరమల్లు చిత్రీకరణ మొదలుపెట్టాడు. కానీ అది పిరయాడికల్ మూవీ కావడంతో పవన్ ఎక్కువ రోజులు కాల్ షీట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కారణం వలనే ఆ చిత్రాన్ని పక్కనబెట్టి ఇతర షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నాడు. అయితే అసలు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వాటిపై అభిమానులు క్లారిటీ కోరుతున్నారు.

Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్..

తాజాగా దీనిపై చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం ఒక క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ వచ్చే ఏడాది జరిగే లెక్కన అయ్యితే ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ పూర్తి చేసి కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటిలో రిలీజ్ చేస్తామని, అలా కాకుండా ఎలక్షన్స్ ముందుకు వస్తే ఆ తరువాతే చిత్రీకరణ మొదలవుతుందని చెప్పుకొచ్చారు.