అమితాబ్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ : అభిషేక్ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : November 7, 2019 / 09:44 AM IST
అమితాబ్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ : అభిషేక్ ఎమోషనల్ పోస్ట్

Updated On : November 7, 2019 / 9:44 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు అవుతోంది. ఆయన నటించిన తొలి సినిమా ‘సాథ్ హిందూస్తానీ’ 1969 నవంబర్ 7న విడుదలైంది. 2019 నవంబర్ 7 నాటికి ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలవుతోంది.

ఈ సందర్భంగా బిగ్ బికు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమితాబ్ నట వారసుడు అభిషేక్ బచ్చన్.. అమితాబ్ హీరో అయినప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు..

Read Also : ఏపీ సీఎం జగన్‌ను కలిసిన వినయ్

‘కేవలం కొడుకుగానే కాదు.. నటుడిగా.. ఓ అభిమానిగా మేమంతా మీ గొప్పతనానికి సాక్షులుగా నిలిచాం.. సినీ అభిమానులంతా తాము బచ్చన్‌ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారు, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు, భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్నందుకు అభినందనలు.. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తాం’ అంటూ అభిషేక్ తన తండ్రి అమితాబ్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..