Thalaivar 170 : రజినీకాంత్‌తో అమితాబ్.. 32 ఏళ్ళ తర్వాత.. తలైవా 170వ సినిమాలో..
రజినీకాంత్ 170వ సినిమాని కూడా ఇటీవల ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.

Amithab Bachchan will play a key role in Rajinikanth 170th film
Rajinikanth : సూపర్ స్టార్(Superstar) రజినీకాంత్ 70 ఏళ్ళు దాటినా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ తన 169వ సినిమా చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా జైలర్(Jailer) సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. జైలర్ సినిమాలో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్.
ఇక రజినీకాంత్ 170వ సినిమాని కూడా ఇటీవల ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్ర చేయనున్నారని, రజినీకాంత్ తో కలిసి అమితాబ్ నటించనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
Pawan kalyan : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ లుక్ అదిరిపోయిందిగా..
గతంలో అమితాబ్, రజినీకాంత్ కలిసి పలు హిందీ సినిమాల్లో నటించారు. చివరిసారిగా వీరిద్దరూ హమ్ అనే సినిమాలో 1991 లో కలిసి నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు 32 ఏళ్ళ తర్వాత ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు విడివిడిగా సినిమాలు చేస్తేనే బాక్సాఫీస్ లు బద్దలవుతాయి. ఇక ఇద్దరూ కలిసి చేస్తే మార్కెట్ ఓ రేంజ్ లో ఉంటుంది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
After more than three decades, India's Top Superstars @SrBachchan and @rajinikanth are joining for @LycaProductions and Dir @tjgnan 's #Thalaivar170
An Exciting development.. Official announcement soon.. pic.twitter.com/VaMm8bBHGE
— Ramesh Bala (@rameshlaus) June 10, 2023