మహేష్ హీరోయిన్- టాలీవుడ్ డైరెక్టర్స్‌‌పై షాకింగ్ కామెంట్స్

అమృతా రావు తెలుగులో సినిమాలు చెయ్యకపోవడానికి కారణం చెప్తూ, టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి తన ఒపీనియన్ చెప్పుకొచ్చింది.

  • Published By: sekhar ,Published On : February 6, 2019 / 11:56 AM IST
మహేష్ హీరోయిన్- టాలీవుడ్ డైరెక్టర్స్‌‌పై షాకింగ్ కామెంట్స్

Updated On : February 6, 2019 / 11:56 AM IST

అమృతా రావు తెలుగులో సినిమాలు చెయ్యకపోవడానికి కారణం చెప్తూ, టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి తన ఒపీనియన్ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యే రిలీజ్ అయిన ఠాక్రే సినిమాలో బాల్ ఠాక్రే భార్య క్యారెక్టర్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన అతిథి మూవీలో హీరోయిన్‌గా నటించిన అమృతా, తర్వాత తెలుగులో సినిమాలు చెయ్యలేదు. తెలుగులో సినిమాలు చెయ్యకపోవడానికి కారణం చెప్తూ, టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి తన ఒపీనియన్ చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో, అమృతాని తెలుగు సినిమాలు ఎందుకు చెయ్యట్లేదని అడగ్గా, నేను అతిథిలో నటిస్తున్నప్పుడే ఒకే మంథ్‌లో మూడు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, టాలీవుడ్ డైరెక్టర్స్ హీరోయిన్స్‌ని చూపించే విధానం నాకు నచ్చదు.

అదేంటో, వాళ్ళు హీరోయిన్లని కేవలం ఒక వస్తువుగానే చూస్తారు. అలాంటి సినిమాలు, క్యారెక్టర్లు చెయ్యడం నా వల్లకాదు. అతిథి చెయ్యడానికి రీజన్ ఏంటంటే, అందులో నా క్యారెక్టర్ హీరోకి ఈక్వల్‌గా ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో మహేష్ ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిపోయాను. మహేష్ ఇంటి నుండి మాకు ఫుడ్ వచ్చేది. ఓ సారి నమ్రత స్వయంగా మాకోసం బ్రౌన్ రైస్ చేసి పంపించింది. నాకిప్పటికీ గుర్తే… అని చెప్పుకొచ్చింది. అమృతా చేసిన కామెంట్స్ గురించి టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.