Baby Trailer : అమ్మాయిల కంటే గట్టిగా అబ్బాయిల గుండెల మీద ఎవరు కొట్టలేరు.. ట్రూగా ప్రేమించే అబ్బాయిలా కథే బేబీ..!

బేబీ ట్రైలర్ వచ్చేసింది. ట్రూగా ప్రేమించే అబ్బాయిలా కథే ఈ బేబీ అమ్మాయిల కంటే గట్టిగా అబ్బాయిల గుండెల మీద ఎవరు కొట్టలేరు.

Baby Trailer : అమ్మాయిల కంటే గట్టిగా అబ్బాయిల గుండెల మీద ఎవరు కొట్టలేరు.. ట్రూగా ప్రేమించే అబ్బాయిలా కథే బేబీ..!

Anand Deverakonda Viraj Ashwin Vaishnavi Chaitanya Baby Trailer released

Baby Trailer : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బేబీ’. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతీ, నిర్మాత SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2020 లో వచ్చిన కలర్ ఫోటో సినిమాకి కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.

Raviteja : మైత్రీ అనౌన్స్‌మెంట్ రవితేజ సినిమా గురించేనా..? ఆ సక్సెస్ ఫుల్ కాబో మళ్ళీ రిపీట్..!

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కథ మొత్తం వైష్ణవి చైతన్య చుట్టూ తిరగనుంది. టీజర్ చూసిన దాన్నిబట్టి అర్ధమైంది ఏంటంటే.. స్కూల్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన హీరోయిన్.. కాలేజీకి వెళ్ళాక అక్కడ మరో వ్యక్తిని కూడా ప్రేమలోకి దించుతుంది. ఆ ఇద్దరు అబ్బాయి హీరోయిన్ గా ట్రూగా ప్రేమిస్తారు. ప్రస్తుతం నిజ జీవితంలో జరుగుతున్న కథలనే ఆధారంగా తీసుకునే దర్శకుడు సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Prabhas : మరోసారి ప్రభాస్‌తో పోటీకి దిగుతున్న దర్శకుడు.. ఈసారైనా ప్రభాస్ నెగ్గుతాడా..?

ఇక ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అందర్నీ లవ్ ఫెయిల్యూర్ కుర్రాల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. “ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదొక సిగ్నల్ ఇస్తాడు. మరి నీలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే”, “తిరిగి కొట్టేంత బలం లేదనేగారా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు” అన్న రెండు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.