‘ఆనంద భైరవి’ అదిరిపోతుంది – అంజలి

అంజలి, రాయ్ లక్ష్మీ, అదిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న “ఆనంద భైరవి” యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 05:28 AM IST
‘ఆనంద భైరవి’ అదిరిపోతుంది – అంజలి

Updated On : January 31, 2020 / 5:28 AM IST

అంజలి, రాయ్ లక్ష్మీ, అదిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న “ఆనంద భైరవి” యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది..

M.V.V. సత్యనారాయణ సమర్పణలో.. అంజలి, రాయ్ లక్ష్మీ, అదిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం “ఆనంద భైరవి”. నంది అవార్డ్ గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “నిధి మూవీస్, హరివెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బి తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ : ‘‘వైజాగ్, హైదరాబాద్‌లలో జరిపిన షూటింగ్‌తో 50% షూటింగ్ పూర్తయింది. తదుపరి హైదరాబాద్, చెన్నయ్‌లలో ఏకధాటిగా జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

Image result for ananda bhairavi anjali

దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ : ‘‘ఇప్పటి వరకు చేసిన షూటింగ్ అద్భుతంగా వచ్చింది. అంజలి, రాయ్ లక్ష్మీ, అదిత్ అరుణ్ కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్ళముందు నా సక్సెస్ కనిపిస్తుంది. తదుపరి షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాo.. మా సినిమాలో కథాంశానికి తగ్గట్టుగా ప్రతి పాత్రను తీర్చిదిద్దాo. సహజత్వంగా కథకు తగ్గట్టుగా ఉండటం కోసం అంజలి, రాయ్ లక్ష్మీ ఎంతో కష్టపడి ప్రత్యేక శిక్షణతో ఎంతో స్లిమ్‌గా తయారయ్యారు. అలాంటి కష్టపడే కథానాయికలు మా చిత్రానికి దొరకడం చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రతి పాత్రకు పెద్ద నటీనటులను ఎన్నుకున్నాం. సమాజంలో ఉన్న ఎన్నో యదార్ధ పాత్రలు మా చిత్రంలో కనబడుతాయి. వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరణ జరుపుతున్నాం’’ అని తెలిపారు.

Read Also : నాగశౌర్య కిరీటం పెడితే కృష్ణుడిలా ఉంటాడు – దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

Image result for ananda bhairavi anjali

కధానాయిక అంజలి మాట్లాడుతూ : ‘‘ఆనందిని పాత్రను పోషిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర సహజత్వంగా ఉండటంతో మంచి నటనను ప్రదర్శించే అవకాశం కలిగింది. ఈ మధ్య కాలంలో బాగా నచ్చి చేస్తున్న పాత్ర ఇది’’ అని చెప్పుకొచ్చారు.
లక్ష్మీరాయ్ మాట్లాడుతూ : ‘‘భైరవి పాత్ర పోషిస్తుంటే చాలా థ్రిల్లింగ్‌‌గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ముంబాయ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా’’ అని అన్నారు.
హీరో అధిత్ అరుణ్ మాట్లాడుతూ : ‘‘ఇందులో రొమాంటిక్ బాయ్ అయినప్పటికీ చాలా సన్నివేశాల్ని ఛాలెంజ్‌గా తీసికొని చేశా. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే సీన్స్ ఇందులో ఉన్నాయి. అవి చేసేటప్పుడు నేను నిజంగానే ఏడ్చా’’ అని చెప్పారు.

Image result for ananda bhairavi anjali

సాయి కుమార్, రాశి, మురళీ శర్మ, సుమన్, బ్రహ్మాజీ, డి.ఎస్.రావ్, గిరి, గుండు సుదర్శన్, ధన్ రాజ్, శ్రీ హర్ష, జ్యోతి, మణిచందన, జయవాణి, మధుమణి, వర్మ, సుబ్బరాయశర్మ, చక్రి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : మధు విపర్తి, మాటలు : భవాని ప్రసాద్, రామ కృష్ణ, రచన సహకారం : రాజేంద్ర, పాటలు : ప్రణవ్, కెమెరా :పి.జి.వింద, సంగీతం : మణిశర్మ, ఆర్ట్ : నాని, ఎడిటర్ : చోట. కె. ప్రసాద్, సమర్పణ : ఎం.వి వి సత్యనారాయణ, నిర్మాతలు : బి.తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల, కథ, కధనం, దర్శకత్వం : కర్రి బాలాజీ.