Ananya Panday : కాఫీ విత్ కరణ్ షోలో.. అతనితో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన అనన్య పాండే..
తాజాగా బాలీవుడ్(Bollywood) హిట్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో దీనిపై స్పందిస్తూ అనన్య పాండే సిగ్గుపడుతూ డైరెక్ట్ గానే చెప్పింది.

Ananya Panday gives Clarity on Love with Aditya Roy Kapoor
Ananya Panday : బాలీవుడ్(Bollywood) భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించింది. గత కొన్నాళ్లుగా అనన్య నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పలుమార్లు వీరు జంటగా తిరుగుతూ మీడియాకు చిక్కారు. ఇటీవల మాల్దీవ్స్(Maldives) లో అనన్య పాండే తన బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోగా తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapur) కూడా వెళ్లినట్టు సమాచారం.
తాజాగా బాలీవుడ్(Bollywood) హిట్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో దీనిపై స్పందిస్తూ అనన్య పాండే సిగ్గుపడుతూ డైరెక్ట్ గానే చెప్పింది. ఇటీవలే కాఫీ విత్ కరణ్(Koffee With Karan) 8వ సీజన్ మొదలవ్వగా మొదటి ఎపిసోడ్ కి రణవీర్ సింగ్, దీపిక పదుకొనే వచ్చి సందడి చేశారు. తాజాగా పలు ఎపిసోడ్స్ ని కలిపి ప్రోమో విడుదల చేయగా ఇందులో సారా అలీఖాన్, అనన్య పాండే ఓ ఎపిసోడ్ కి వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : Chitra : సౌందర్య బయోపిక్ తీస్తే ఈ అమ్మాయి సరిపోతుందా? .. అచ్చం సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి..
ఈ షోలో కరణ్ సారా అలీఖాన్ ని.. అనన్య దగ్గర ఉన్న వస్తువు, నీ దగ్గర లేనిది ఏంటి అని అడగ్గా ది నైట్ మేనేజర్ అని చెప్పింది. ది నైట్ మేనేజర్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించాడు. దీంతో అనన్య తెగ సిగ్గుపడిపోయింది. వెంటనే తాను అనన్య రాయ్ కపూర్ లా ఫీల్ అవుతున్నాను అని డైరెక్ట్ గా చెప్పడంతో అనన్య ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలిసిపోతుంది. మరి ఈ జంట కూడా పెళ్లి దాకా వెళ్తుందా లేక డేటింగ్ వరకేనా చూడాలి.