Anasuya Bharadwaj: బాలయ్య సినిమాలో హాట్ యాంకరమ్మ.. ఏం చేస్తుందంటే..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తికాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో ఓ హాట్ యాంకరమ్మ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Anasuya Bharadwaj: బాలయ్య సినిమాలో హాట్ యాంకరమ్మ.. ఏం చేస్తుందంటే..?

Anasuya Bharadwaj Special Song In NBK108

Updated On : September 20, 2022 / 5:19 PM IST

Anasuya Bharadwaj: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తికాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన బాలయ్య, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

Anasuya Bharadwaj: ఆంటీ అన్నారో.. అంతే సంగతులు.. అనసూయ వార్నింగ్!

కాగా, ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ హాట్ యాంకరమ్మ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. తన హాట్ అందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్న అనసూయ, అటు హాట్ ఐటెం సాంగ్స్‌లోనూ రెచ్చిపోతుంది. కాగా, తాజాగా బాలయ్య అనిల్ రావిపూడి మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో అనసూయ అయితే బాగుంటుందని దర్శకుడు అనిల్ భావిస్తున్నాడు.

Anasuya : మీలా పనీపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది.. మళ్ళీ ట్విట్టర్లో అనసూయ రచ్చ..

ఈ మేరకు అనసూయను అప్రోచ్ కూడా అయ్యాడట ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అనసూయ చిందులేసేందుకు ఒప్పుకుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. మరి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.