వావ్! ఇలా అనసూయను ట్రెడిషనల్ వేర్‌లో చూసి ఎంతకాలమైంది?

బుల్లితెర యాంకర్ అనసూయ ట్రెడిషనల్ వేర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : April 2, 2020 / 10:13 AM IST
వావ్!  ఇలా అనసూయను ట్రెడిషనల్ వేర్‌లో చూసి ఎంతకాలమైంది?

Updated On : April 2, 2020 / 10:13 AM IST

బుల్లితెర యాంకర్ అనసూయ ట్రెడిషనల్ వేర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

బుల్లితెర స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా అనూసూయ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. షోస్‌లో, ప్రైవేట్ ఈవెంట్స్‌లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో హీటెక్కించే అనసూయ పండగ సందర్భంగా ట్రెడిషనల్ వేర్‌లో కనిపించి ఆకట్టుకుంది.

లంగా ఓణీలో సాంప్రదాయానికి చిరునామాలా ఉంది అనసూయ. ఎల్లో టాప్, గ్రీన్ పట్టు లంగాలో పసిడి బొమ్మలా చిరునవ్వులు చిందిస్తూ కుర్రకారు మనసుల్ని గిలిగింతలు పెడుతోంది. జబర్దస్త్ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా చేసిన ఫోటోషూట్ ఫోటోలు కొన్ని అనసూయ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా భారీగా లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి.

Read Also : నందమూరి, దగ్గుబాటి మల్టీస్టారర్.. మామూలుగా ఉండదు మరి..

మోడ్రన్ డ్రెస్సుల్లో మతి పోగొట్టడం, సాంప్రదాయ వస్త్రధారణలో శభాష్ అనిపించుకోడమూ అనసూయకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే.. కరోనా నేపథ్యంలో సినిమాలతో సహా బుల్లితెర షూటింగులూ బంద్ అయ్యాయి. మరి అనసూయ ఫెస్టివల్ ఎపిసోడ్ ఎలా చేసింది?.. అవి లేటెస్ట్ పిక్స్ కాదు పాత ఫోటోలు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.