Anasuya : నా పేరు వాడితే కోర్టుకి వెళ్తా : అనసూయ

మా ఎలక్షన్స్ లో అనసూయకి గట్టి షాక్ తగిలింది. ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేసిన రోజు అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందని మీడియా ప్రకటించింది. ఎన్నికల అధికారులు చెప్పారో లేదో తెలియదు

Anasuya : నా పేరు వాడితే కోర్టుకి వెళ్తా : అనసూయ

Anasuya

Updated On : October 12, 2021 / 9:44 PM IST

Anasuya : జబర్దస్త్ లో తన యాంకరింగ్, తన అందాలతో అలరిస్తున్న అనసూయ ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసింది అయితే ‘మా’ ఎలక్షన్స్ లో అనసూయకి గట్టి షాక్ తగిలింది. ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేసిన రోజు అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందని మీడియా ప్రకటించింది. ఎన్నికల అధికారులు చెప్పారో లేదో తెలియదు కానీ మీడియాలో మాత్రం గెలిచినట్టు వార్తలు వచ్చాయి. కానీ నెక్స్ట్ డే ఓడిపోయిందని ప్రకటించారు. గెలిచిన వాళ్ళు ఎలా ఓడిపోతారంటూ ఇప్పటికే దీనిపై ట్వీట్స్ చేస్తూ సీరియస్ కూడా అయింది అనసూయ.

Sunnyleone : స్వర్గం నా ఇంట్లో ఉంది : సన్నీ లియోన్

ఇవాళ ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టి తమ ప్యానల్ లో గెలిచిన వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. అనసూయ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ కావడంతో ఈ మీటింగ్ కి వచ్చింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా అనసూయని మాట్లాడించడానికి ట్రై చేశారు. దీంతో అనసూయ సీరియస్ అయి అసలు నేను గెలిచాను అని ప్రకటించకుండానే మీ ఛానల్స్ లో ఎలా న్యూస్ వేస్తారు అని ప్రశ్నించింది. నిజాలు తెలుసుకోకుండా ఇకపై తన పేరు వాడితే కోర్టుకు వెళ్తానంటూ యాంకర్‌ అనసూయ సీరియస్‌ అయ్యింది. నా ప్రమేయం లేకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానెల్స్‌లో కానీ, న్యూస్ ఛానెల్స్‌లో కానీ తప్పుడు వార్తలకు నా పేరును పెడితే ఇకపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించింది.