Anasuya : ఏజ్ విషయంలో రాసిన ఆర్టికల్ పై ఫైర్ అయిన అనసూయ..

అనసూయ చాలా సార్లు తనపై వచ్చిన వార్తలపై స్పందించింది. తన గురించి ఎవరన్నా తప్పుగా రాస్తే కచ్చితంగా ఫైర్ అవుతుంది. తాజాగా అనసూయపై ఆర్టికల్ రాసిన ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయింది.....

Anasuya :  ఏజ్ విషయంలో రాసిన ఆర్టికల్ పై ఫైర్ అయిన అనసూయ..

Anasuya

Updated On : February 19, 2022 / 7:58 AM IST

Anasuya :   ఇటీవల సెలబ్రిటీలు తమ పైన వస్తున్న న్యూస్ లకి, ఫేక్ న్యూస్ లకి స్పందిస్తున్నారు. వీటిలో అనసూయ ముందు ఉంటుంది. అనసూయ చాలా సార్లు తనపై వచ్చిన వార్తలపై స్పందించింది. తన గురించి ఎవరన్నా తప్పుగా రాస్తే కచ్చితంగా ఫైర్ అవుతుంది. తాజాగా అనసూయపై ఆర్టికల్ రాసిన ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయింది.

అనసూయ ప్రతివారం జబర్దస్త్ షూట్ జరిగినప్పుడు ఆ రోజు వేసుకునే కాస్ట్యూమ్స్ తో ఫొటోషూట్ తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఇటీవల తాజాగా కొత్త ఫొటోషూట్ ని పోస్ట్ చేసింది అనసూయ. ఈ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఓ వెబ్ సైట్ లో ఆర్టికల్ రాశారు. అయితే ఇందులో ఆమె ఏజ్ ని ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ లో.. ‘‘వైట్ శారీలో దేవకన్యలా ఉన్న అనసూయ.. ముద్దుగుమ్మ అనసూయ అందాల ఆరబోతకు వెనకడుగు వేయదు. అయితే ఆమె వయస్సు 40 ఏళ్ళు దాటినా..’’ అంటూ రాశారు. ఈ ఆర్టికల్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ అనసూయకి ట్యాగ్ చేయడం విశేషం.

AHA : జడ్జిగా మారనున్న నిత్యా మీనన్.. ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌లో సరికొత్త ఎంట్రీ

దీంతో ఏజ్ గురించి రాయడంతో పాటు తప్పుడు ఏజ్ రాసినందుకు అనసూయ ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ పై ఫైర్ అయింది. ఈ ఆర్టికల్ ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘నా వయసు 40 కాదు 36. వయసు పెరగడం అనేది సాధారణమైన విషయం. నా వయసుని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు. కాబట్టి మీరు వార్తలు రాసేటప్పుడు కచ్చితమైన సమాచారాన్ని పద్ధతిగా ఇస్తే బాగుంటుంది. చెప్పే విషయాన్ని కాస్త మర్యాదపూర్వకంగా చెబితే బాగుంటుంది. ఎందుకంటే జర్నలిజం అనేది ఒక ఆయుధం. దాన్ని మనం కరెక్ట్ గా నిర్వహించకపోతే మనకే ఎదురుదెబ్బలు తగులుతాయి’’ అని పోస్ట్ చేసింది.