Anasuya : ఇద్దరి పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుంటావా.. కామెంట్‌కి కౌంటర్ ఇచ్చిన అనసూయ

ఓ నెటిజన్ ట్విట్టర్ లో అనసూయని ట్యాగ్ చేస్తూ.. ''అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’’ అని కామెంట్.......

Anasuya : ఇద్దరి పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుంటావా.. కామెంట్‌కి కౌంటర్ ఇచ్చిన అనసూయ

Anasuya

Updated On : April 4, 2022 / 1:57 PM IST

Anasuya :  యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఇక పొట్టి పొట్టి బట్టలతో ఫొటోషూట్స్ చేసి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. యాంకర్ అనసూయను, తన డ్రెస్ లను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కొత్తేమి కాదు. తాను కూడా ఆ కామెంట్స్, ఆ ట్రోల్స్ కి తగ్గట్టే ఉంటుంది. అప్పుడప్పుడు తనపై వచ్చే ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెప్తుంది అనసూయ. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే రిపీట్ అయింది.

Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ లో అనసూయని ట్యాగ్ చేస్తూ.. ”అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’’ అని కామెంట్ చేశాడు. అయితే అనసూయ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ.. ‘‘దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’’ అని పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో కొంతమంది అనసూయని సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది అనసూయని వ్యతిరేకిస్తున్నారు.