Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??

ఇటీవల జబర్దస్త్ నుండి ఒక్కొక్కరు మెల్లిగా వీడిపోతున్నారు. గతంలోనే మల్లెమాల యాజమాన్యానికి నాగబాబుకి గొడవలు అవడంతో నాగబాబుతో పాటు.............

Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??

Anasuya

Updated On : June 30, 2022 / 7:12 AM IST

Jabardasth : తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా ఎదిగింది జబర్దస్త్. బాగా పాపులర్ అవడంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని కూడా ఇంకో షో మొదలుపెట్టారు. కామెడీ స్కిట్స్‌తో ప్రేక్షకులని బాగా అలరించి టీఆర్పీ సైతం రప్పించుకుంది. జబర్దస్త్ వల్ల ఎంతో మంది బాగా సంపాదించి పైకి ఎదిగారు. జబర్దస్త్ వల్ల ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. ఈ షో ఒక పెద్ద ఛానల్ లో టెలికాస్ట్ అవుతుండగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల జబర్దస్త్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి.

ఇటీవల జబర్దస్త్ నుండి ఒక్కొక్కరు మెల్లిగా వీడిపోతున్నారు. గతంలోనే మల్లెమాల యాజమాన్యానికి నాగబాబుకి గొడవలు అవడంతో నాగబాబుతో పాటు ధనరాజ్, అదిరే అభి, కిరాక్ ఆర్పీ, అప్పారావు, వేణు, చమ్మక్ చంద్ర లాంటి కొంతమంది కమెడియన్స్ జబర్దస్త్ ని వీడారు. ఇక ఇటీవల కొన్ని రోజుల క్రితం గెటప్ శ్రీను సినిమాలతో బిజీ అవ్వడంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజాకి మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ ని వీడింది. ఆ తర్వాత హైపర్ ఆది కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ కి బాగా పేరు రావడానికి కారణం అయిన సుడిగాలి సుధీర్ కూడా ఇటీవల వేరే ఛానల్ కి వెళ్ళిపోయాడు. దీంతో ఇప్పటికే జబర్దస్త్ కి బాగా ఎఫెక్ట్ అయింది. స్టార్ కమెడియన్స్ అంతా వెళ్లిపోవడంతో జబర్దస్త్ రేటింగ్ కూడా తగ్గింది.

Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..

తాజాగా జబర్దస్త్ కి యాంకర్ అనసూయ కూడా గుడ్‌బై చెప్పేసింది. ఇటీవల వరుసగా వేరే ఛానల్స్ ప్రోగ్రామ్స్ లో అనసూయ పాల్గొంటుంది. ఇప్పటివరకు షూట్ చేసి ఉన్న జబర్దస్త్ ఎపిసోడ్స్ లో అనసూయ కనిపిస్తుంది. ఆ తర్వాత అనసూయ కూడా జబర్దస్త్ లో కనపడదు. దీనిపై ఇండైరెక్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది అనసూయ.”నా కెరీర్‌లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మెమరీస్ తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు, కొన్ని చేదు క్షణాలు కూడా ఉన్నాయి. ఇక ముందు కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను” అని అనసూయ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ సినిమాలతో పాటు వేరే ఛానల్స్ షోలలో బిజీగా ఉంది. అనసూయ కూడా వెళ్లిపోవడం జబర్దస్త్ కి పెద్ద నష్టమే అని అభిప్రాయపడుతున్నారు.