Anchor Anasuya : ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..

లైగర్ సినిమా ఆశించినంత విజయం దక్కకపోవడంతో విజయ్ పై ఇండైరెక్ట్ గా గతంలోని ఓ సంఘటని గుర్తుచేస్తూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది............

Anchor Anasuya : ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..

Anchor Anasuya trolled by netizens with calling aunty

Updated On : August 27, 2022 / 10:11 AM IST

Anchor Anasuya :  బుల్లితెరపై యాంకర్ గా వెలుగుతూనే సినిమాల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు పెడుతూనే ఉంటుంది. సినిమాల్లో, షోలలో కూడా అందాల ఆరబోతకు ఏ మాత్రం తగ్గదు అనసూయ. ఇవన్నీ చేస్తూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మంచిమాటలు పెడుతూ ఉంటుంది. లేదా తనని ఎవరన్నా ఎమన్నా అంటే వాళ్ళకి గట్టిగా సమాధానమిస్తుంది. దీంతో ప్రతి సారి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటారు. తాజాగా మరోసారి అనసూయ నెటిజన్లు ట్రోల్ చేసేలా చేసుకుంది.

లైగర్ సినిమా ఆశించినంత విజయం దక్కకపోవడంతో విజయ్ పై ఇండైరెక్ట్ గా గతంలోని ఓ సంఘటని గుర్తుచేస్తూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది ఆంటీ అని పిలుస్తూ అనసూయని ట్రోల్ చేశారు. దీనికి అనసూయ సీరియస్ అయి ఆంటీ అని పిలిచిన వాళ్ళ అందరి ట్వీట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాను అని ట్వీట్ చేసింది. ఇక అంతే అప్పట్నుంచి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్ని సోషల్ మీడియాలో ఆంటీ అంటూ పోస్టులు, మీమ్స్, హ్యాష్ ట్యాగ్స్ పోస్ట్ చేశారు. ఏకంగా ట్విట్టర్ లో ఇండియా వైడ్ ఆంటీ అనే పదం ట్రెండింగ్ అయిందంటే నెటిజన్లు అనసూయని ఏ రేంజ్ లో ఆడుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Anasuya Bharadwaj: ఆంటీ అన్నారో.. అంతే సంగతులు.. అనసూయ వార్నింగ్!

అప్పటికి అనసూయ వదలకుండా తనని ట్యాగ్ చేసి పెట్టె ట్వీట్స్ కి కౌంటర్లు వేస్తూ రిప్లై ఇచ్చింది. ఎంత ఏజ్ ఉన్నా ఆంటీ అని పిలవొద్దని, కేసు పెడతానని, ఆంటీ అంటే అబ్యుజింగ్ చేసినట్టు అని, సోషల్ మీడియాలో చెత్త ఎక్కువైందని.. ఇలా చాలా కామెంట్స్ చేస్తూ ట్వీట్స్ చేసింది. దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి మీ ఏజ్ వాళ్ళని ఆంటీ అనకపోతే ఏమనాలి, అది బూతు పదం అని ఫస్ట్ మీరే చెప్పారు, 30 ఇయర్స్ ఉన్నవాళ్ళని పిల్లలు కూడా అంకుల్, ఆంటీ అని పిలుస్తారు వాళ్ళ మీద కూడా కేసు పెడతావా, నువ్వు నీ షోలో అసభ్యకరమైన పదాలు వాడినప్పుడు లేదా అంటూ కౌంటర్లు ఇచ్చారు నెటిజన్లు. నిన్న మధ్యాహ్నం మొదలైన ఈ ఆంటీ రచ్చ రాత్రి దాకా సాగుతూనే ఉంది.

Anasuya : నాపైన వేసే పంచులు నచ్చకే జబర్దస్త్ మానేశాను.. వాళ్ళు వెళ్లిపోయారని వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్‌ కాదు..

చివర్లో అనసూయ ఇలాంటివి పట్టించుకోవద్దని సినీ పెద్దలు ఫోన్ చేసి చెప్పారని, వాళ్ళ మీద గౌరవంతో వదిలేస్తున్నాను అని ఓ ట్వీట్ చేసింది. అయితే నెటిజన్లు దీనికి కూడా కౌంటర్లు ఇచ్చారు. ఇలాంటి చిన్న వాటికి సినీ పెద్దలు ఫోన్ చేశారా నీకు, ఆ సినీ పెద్దలు ఎవరో అంటూ మళ్ళీ ట్రోల్ చేశారు. మొత్తానికి అనసూయ ఒక రోజంతా ట్రెండ్ లోకి వచ్చింది. అనసూయ వల్ల ఆంటీ అనే పదం కూడా ట్విట్టర్ లో ఇండియా వైడ్ ట్రెండ్ అవడం విచిత్రమే. ఇకనైనా అనసూయ మారాలని, మరీ ఇలా చీప్ గా బిహేవ్ చేయొద్దని, అనసూయ కంటే స్టార్స్ చాలా మంది ఉన్నారని, వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేయరని నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అనసూయకి. ఎన్ని సార్లు చెప్పినా మారదు అన్నట్టు మళ్ళీ ఇంకోసారి అనసూయ ఇలాంటి ట్వీట్స్ తో రచ్చ లేపుతుందేమో చూడాలి.