Anasuya : నాపైన వేసే పంచులు నచ్చకే జబర్దస్త్ మానేశాను.. వాళ్ళు వెళ్లిపోయారని వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్‌ కాదు..

అనసూయ మాట్లాడుతూ.. ''దాదాపు రెండేళ్ల నుంచే ఆ షో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నా. ఆ షోలో చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్‌ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్‌, వెకిలి చేష్టలు లాంటివి నచ్చవు........

Anasuya : నాపైన వేసే పంచులు నచ్చకే జబర్దస్త్ మానేశాను.. వాళ్ళు వెళ్లిపోయారని వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్‌ కాదు..
ad

Anasuya :  కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులని నవ్వించిన జబర్దస్త్ షో నుంచి ఇటీవల ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఈ షో ద్వారా ఎంతో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్లు, ఆర్టిస్టులు ఇటీవల ఆ షో యాజమాన్యంతో విభేదాలు వచ్చి కొంతమంది, వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులిస్తున్నారని కొంతమంది, బయట సినిమా అవకాశాలు వస్తున్నాయని కొంతమంది, జడ్జిగా చేసిన నాగబాబు వెళ్లిపోయారని కొంతమంది వెళ్లిపోయారు, వెళ్లిపోతున్నారు. తాజాగా ఈ షో నుంచి యాంకర్ అనసూయ కూడా వెళ్ళిపోయింది.

అనసూయకి యాంకర్ గా ఒక కెరీర్ ఇచ్చి, తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ ని వదిలేసి వెళ్ళిపోయింది. అనసూయ వెళ్ళిపోయాక ఎందుకు వెళ్లిపోయిందో అంటూ అనేక కారణాలు వినిపించాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తాను ఎందుకు వెళ్లిపోయిందో తెలిపింది.

అనసూయ మాట్లాడుతూ.. ”దాదాపు రెండేళ్ల నుంచే ఆ షో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నా. ఆ షోలో చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్‌ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్‌, వెకిలి చేష్టలు లాంటివి నచ్చవు. ఆ పంచులు నచ్చక సీరియస్ అయి, వరస్ట్ రియాక్షన్స్ కూడా ఇచ్చాను. కానీ అవన్నీ టెలికాస్ట్ లో చూపించరు. ఇలా చాలా సార్లు జరిగింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ నేను మాత్రం అందులోనే ఉండిపోవాలని అనుకోవడంలేదు. నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్ళిపోయాను అని చాలా మంది అన్నారు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్‌ కాదు. ప్రస్తుతం నాకు చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమాలపై మరింత ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోయాను” అని తెలిపింది.

Tejaswi Madivada : ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు.. నేను పెళ్లి చేసుకోను..

దీంతో మరోసారి అనసూయని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుందని, డబ్బులు ఎక్కువ ఇస్తే అలాంటి పంచులు ఎన్నైనా తన మీద వేయించుకుంటుందని, డబ్బులు ఇస్తే సినిమాల్లో ఎలాంటి పాత్రలు అయినా పోషిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అవకాశాల కోసం, డబ్బుల కోసం నీకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఇలా కామెంట్స్ చేస్తుంది అని అంటున్నారు నెటిజన్లు.