Rashmi Gautam : కుక్కపై దాడి.. మండిపడ్డ రష్మీ.. వాడు అంతగా దిగజారి ఆ పని చేశాడు

యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. జంతు ప్రేమికురాలైన రష్మీ కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది.

Rashmi Gautam : కుక్కపై దాడి.. మండిపడ్డ రష్మీ.. వాడు అంతగా దిగజారి ఆ పని చేశాడు

Rashmi Gautam

Updated On : November 4, 2021 / 9:35 PM IST

Rashmi Gautam : యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. జంతు ప్రేమికురాలైన రష్మీ కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది. ఇక ఎవరైనా మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది రష్మీ. ఓ వ్యక్తి కుక్కను హింసించిన వీడియో గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి : Rashmi Gautam: మీరు మనుషులేనా..? కుక్కను కొడుతుంటే రష్మీ విలవిల

బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో షేర్ చేసిన రష్మీ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు రష్మీకి సపోర్ట్ చేస్తున్నారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలనీ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలు పెట్టారు జంతు ప్రేమికులు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

చదవండి : Rashmi Gautam: కైపెక్కించే పోజులతో మెరిసిపోయే బుల్లితెర క్వీన్ రష్మీ!