Anchor Suma Son Movie Debut : సూపర్ హిట్ డైరెక్టర్ దర్శకత్వంలో యాంకర్ సుమ కొడుకు మొదటి సినిమా..
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని వ్యక్తులు. వీరిద్దరికి రోషన్, మనస్విని.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా నేడు రోషన్ పుట్టిన రోజు కావడంతో మొదటి సినిమాని అధికారికంగా ప్రకటించారు.

Anchor Suma Son Roshan Kanakala Movie Debut with kshanam movie direcor Ravikanth Perepu
Anchor Suma Son Movie Debut : యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని వ్యక్తులు. వీరిద్దరికి రోషన్, మనస్విని.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. 2016లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన నిర్మల కాన్వెంట్ సినిమాలో యాక్టింగ్ డెబ్యూట్ చేసిన రోషన్ కనకాల.. ఆ తరువాత హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళిపోయాడు. ఇటీవలే చదువు పూర్తి చేసుకొని రావడంతో, హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం కథలు వింటూనే నటుడిగా తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడు.
Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7 అప్డేట్ ఇచ్చిన టామ్ క్రూజ్..
గతంలో సుమ తానే నిర్మాతగా మారి తన కొడుకుని హీరోగా పరిచయం చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఆ సినిమాకి దర్శకుడిగా విరించి వర్మ, ప్రశాంత్ వర్మ అంటూ పేర్లు కూడా వినిపించాయి. కాగా నేడు రోషన్ పుట్టిన రోజు కావడంతో మొదటి సినిమాని అధికారికంగా ప్రకటించారు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రోషన్ డీజే గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అడివిశేష్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘క్షణం’ సినిమాని డైరెక్ట్ చేసిన రవికాంత్ పెరేపు ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు.
PVT04 : వైష్ణవ్ తేజ్ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ఉగ్రరూపం..
చివరిగా ఈ దర్శకుడు ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాతో డీసెంట్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ తన మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి కథని కూడా రవికాంతే అందిస్తున్నాడు. తన రైటింగ్స్ తో రెండు హిట్టులు అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టి రోషన్ కి మంచి డెబ్యూట్ ఇస్తాడో? లేదో? చూడాలి. తన మునపటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన శ్రీచరణ్ పకల ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అండ్ యాక్టర్స్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మహేశ్వరీ మూవీస్ పతాకం పై పి విమల ఈ చిత్రాన్ని మొదటి ప్రొడక్షన్ గా నిర్మించబోతున్నారు.
View this post on Instagram