Jani Master : జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..

ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్ కు ఇదొక గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి.

Jani Master : జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..

Jani Master

Updated On : December 9, 2024 / 12:09 AM IST

Jani Master : జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. 5వ సారి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. దీంతో జోసెఫ్ ప్రకాశ్ ప్యానల్ సంబరాలు చేసుకుంటోంది. ఆదివారం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.

ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్ కు ఇదొక గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి. కాగా, జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగిక వేధించారని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు.

జైలు నుంచి బయటకు వచ్చాక.. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. కష్టకాలంలో తనకు భార్య, అభిమానులు అండగా నిలిచారని చెప్పారు. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అని చెప్పారాయన. ఇలాంటి సిచుయేషన్ వస్తే ఎవరూ కనబడరు, కానీ నన్ను మీ ఇంటి పిల్లాడిలా ఆశీర్వదించారని చెప్పారు. నాపై నమ్మకం పెట్టుకున్నారన్న జానీ మాస్టర్.. త్వరలోనే అదేంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

 

Also Read : ‘పుష్ప’లో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్ర చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసా? ఇప్పటికే బోల్డన్ని సినిమాల్లో..