Bheemla Nayak: మరో సాంగ్ లీక్.. నిన్న మహేష్ నేడు పవన్!

టాలీవుడ్ ను లీకుల బెడద వేధిస్తుంది. నిన్న మహేష్ బాబు.. నేడు పవన్ కళ్యాణ్ ఈ లీకులకు బాధితులయ్యారు. మహేష్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న..

Bheemla Nayak: మరో సాంగ్ లీక్.. నిన్న మహేష్ నేడు పవన్!

Bheemla Nayak

Updated On : February 14, 2022 / 4:58 PM IST

Bheemla Nayak: టాలీవుడ్ ను లీకుల బెడద వేధిస్తుంది. నిన్న మహేష్ బాబు.. నేడు పవన్ కళ్యాణ్ ఈ లీకులకు బాధితులయ్యారు. మహేష్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న వాలంటైన్ డే రోజున కళావతి పాట రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా రెండు రోజుల ముందే ఈ సాంగ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒకరోజు ముందే ఫిబ్రవరి 13నే కళావతి ఒరిజినల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Khiladi-DJ Tillu: మాస్ రాజా రొటీన్ కంటెంట్ VS టిల్లు గాడి హిలేరియస్!

సర్కారు వారి పాట నుండి సాంగ్ లీకవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా.. దానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అదలా ఉండగానే ఇప్పుడు మరో సాంగ్ కూడా లీకైంది. టాలీవుడ్ మరో క్రేజీ ప్రాజెక్ట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ నుండి ఈ పాట లీకైంది. ఆదివారం మేకర్స్ ఏ పాటకి సంబంధించి స్టిల్ రిలీజ్ చేశారో ఇప్పుడు అదే పాటకి సంబంధించి వీడియో బిట్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఒక్కరోజు వ్యవధిలోనే స్టార్ హీరోల సినిమాల నుంచి లీక్స్ రావడం విశేషం కాగా.. ఈ రెండు సినిమాలకు కూడా థమనే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కళావతి సాంగ్ లీకేజీపై థమన్ మహేష్ అభిమానులతో పాటు మూవీ మేకర్స్ కు సారీ చెప్పాడు. మరి.. భీమ్లా నాయక్ పాట లీకేజీపై థమన్ ఎలా స్పందిస్తాడో.. మేకర్స్ దీనిపై చర్యలు తీసుకుంటారా.. ఈ లీకైన పాటని భీమ్లా నాయక్ టీం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి.