Anupama Parameswaran: ‘18 పేజెస్’ను అందరూ ఎంజాయ్ చేస్తారంటోన్న అనుపమ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌లు ‘కార్తికేయ-2’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి, ఇప్పుడు మరోసారి ‘18 పేజెస్’ అనే రొమాంటిక్ మూవీతో మనముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Anupama Parameswaran: ‘18 పేజెస్’ను అందరూ ఎంజాయ్ చేస్తారంటోన్న అనుపమ

Anupama Parameswaran About 18 Pages Movie

Updated On : December 21, 2022 / 10:11 PM IST

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌లు ‘కార్తికేయ-2’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి, ఇప్పుడు మరోసారి ‘18 పేజెస్’ అనే రొమాంటిక్ మూవీతో మనముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Anupama Parameswaran : డైరెక్ట్ ఓటిటి అంటున్న అనుపమ పరమేశ్వరన్..

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ప్రస్తుతం యమ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషనల్ టూర్ కూడా చేపట్టింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హీరోయిన్ అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ‘18 పేజెస్’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను నమ్ముతున్నానని.. ఇక ఈ సినిమాలో తన పాత్ర తన కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చని అమ్మడు తెలిపింది.

Anupama Parameswaran: చీర వయ్యారంలో అనుపమ పరమేశ్వరన్ సోయగం..

నిఖిల్‌తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని.. ఈ సినిమాతో తమ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేయగా, సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించారు. మరి ‘18 పేజెస్’ అనుపమకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.