Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా.. ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పుడు?

మలయాళం స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా.. ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పుడు?

Anupama Parameswaran

Updated On : August 5, 2025 / 3:28 PM IST

Anupama Parameswaran : మలయాళం స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మాణంలో ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. J.S.K సినిమా ఇటీవల జులైలో మలయాళంలో రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Ram Lakshman – Chiranjeevi : చిరంజీవి అన్నయ్య వల్లే మాకు ఫేవరేట్ హీరోయిన్ లేదు.. చెన్నైలో ఆయన్ని చూడటానికి ఆరు నెలలు పట్టింది..

న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అని ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా సాగుతుంది.

Also Read : Santhosh Balaraj : కన్నడ హీరో కన్నుమూత.. 34 ఏళ్ళ వయసులోనే..