Anupama Parameswaran : గాల్లో తేలుతూ, గాల్లో సైకిల్ తొక్కుతూ అడవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుపమ.. వీడియో చూశారా?

టీవల అనుపమ మారిషస్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అడవుల్లో, బీచ్ ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేస్తుంది.

Anupama Parameswaran : గాల్లో తేలుతూ, గాల్లో సైకిల్ తొక్కుతూ అడవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుపమ.. వీడియో చూశారా?

Anupama Parameswaran Enjoying in Mauritius on her Vacation

Updated On : February 26, 2024 / 9:59 AM IST

Anupama Parameswaran : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఈగల్ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు చేస్తుంది. త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. ఒకప్పుడు ట్రెడిషినల్ క్యారెక్టర్స్ చేసిన అనుపమ ఇప్పుడు మాత్రం ఫుల్ గా రెచ్చిపోయి బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుంది. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ లో లిప్ కిస్ లతో, రొమాన్స్ సీన్స్ తో అదరగొట్టింది.

ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇటీవల అనుపమ మారిషస్(Mauritius) కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అడవుల్లో, బీచ్ ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేస్తుంది. తాజాగా మారిషస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో.. స్కై రోప్ డైవింగ్, గాల్లో రోప్ సహాయంతో సైకిల్ తొక్కడం, గాల్లో రోప్ సహాయంతో వెళ్లడం, కార్ రేస్, సెలయేళ్ళ వద్ద ఎంజాయ్ చేయడం, అడవుల్లో జంతువులతో, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

Also Read : Operation Valentine Pre Release Event : వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

దీంతో అనుపమ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుపమ ఇంకా మారిషస్ లోనే ఉన్నట్టు సమాచారం. మొత్తానికి అనుపమ మారిషస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. తిరిగి వచ్చాక టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ లో పాల్గొననుంది.