Anushka: “కాంతారా”పై మనసు పారేసుకున్న స్వీటీ..

కెజిఫ్ ఫ్రాంచైజ్ చిత్రాలను తెరకెక్కించిన 'హోంబలే ఫిల్మ్స్' సంస్థ నుంచి వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా “కాంతారా”. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కేవలం కర్ణాటక బాక్స్ ఆఫీస్ ను మాత్రమే కాదు మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సైతం షేక్ చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను, స్టార్ హీరోలు సైతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్వీటీ అనుష్క...

Anushka: “కాంతారా”పై మనసు పారేసుకున్న స్వీటీ..

Anushka Comments on Kantara Movie

Updated On : October 16, 2022 / 9:00 PM IST

Anushka: కెజిఫ్ ఫ్రాంచైజ్ చిత్రాలను తెరకెక్కించిన ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థ నుంచి వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా “కాంతారా”. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కేవలం కర్ణాటక బాక్స్ ఆఫీస్ ను మాత్రమే కాదు మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సైతం షేక్ చేస్తుంది. తెలుగునాట ఈ శనివారం విడుదలైన ఈ మూవీ, టాలీవుడ్ ప్రేక్షకుల చేత కూడా బ్రహ్మరధం పట్టేలా చేసింది.

Prabhas: “కాంతారా” సినిమాపై ప్రభాస్ ప్రశంసల జల్లు..

అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను, స్టార్ హీరోలు సైతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను హీరో ధనుష్, బాహుబలి, భల్లాలదేవుడు అభినంధించగా, ఇప్పుడు టాలీవుడ్ స్వీటీ అనుష్క కూడా సినిమాపై తన అనుభవాన్ని వెల్లడించింది.

“కాంతారా సినిమా నాకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటులకు , నిర్మాతలకు , సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. ఇటువంటి సినిమా అందించినందుకు రిషబ్ శెట్టి గారికి నా ధన్యవాదాలు. దయచేసి ఈ సినిమాని థియేటర్లలో చూడండి” అంటూ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)