లవ్లీ లాక్‌డౌన్ – వంటింటి కత్తెరతో హెయిర్ కట్
లాక్‌డౌన్ నేపథ్యంలో భర్త కోహ్లికి హెయిర్ కట్ చేసిన అనుష్క శర్మ..

లాక్‌డౌన్ నేపథ్యంలో భర్త కోహ్లికి హెయిర్ కట్ చేసిన అనుష్క శర్మ..
కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు.
తాజాగా అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లికి హెయిర్ కట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అనుష్క హెయిర్ కట్ చేసింది కిచెన్ కత్తెరతో కావడం విశేషం. ‘క్వారంటైన్‌లో ఇలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నించండి. వంటింటి కత్తెరతో హెయిర్ కట్ చేసుకోవచ్చు అని ఈ రోజు తెలిసింది.
ఇక నా సతీమణి నాకు హెయిర్ కట్ అద్భుతంగా చేసింది’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అనుష్క హెయిర్ కట్ చేస్తుంటే కోహ్లి నవ్వుతూ కుదురుగా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరుష్కలు చూపించిన ఈ పద్దతిని మిగతా వారు ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Meanwhile, in quarantine.. ??♂??♀ pic.twitter.com/XO0UJ7NmSU
— Anushka Sharma (@AnushkaSharma) March 28, 2020