అనుష్క శర్మ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ చూశారా..
కరోనా ఎఫెక్ట్- ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ విసిరిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ..

కరోనా ఎఫెక్ట్- ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ విసిరిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ..
గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ బుధవారం ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ విసిరారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు మేర ముదుజాగ్రత్త చర్యగా అనుష్క శర్మ తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుని ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరారు.
Read Also : మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముందు జాగ్రత్త చర్యగా అందరూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని ఆమె సలహా ఇచ్చారు.అంతకు ముందు బాలీవుడ్ మరో నటి దీపికా పదుకోన్ కూడా తన చేతులు కడిగి ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరిన సంగతి తెలిసిందే. యాంకర్ సుమ ‘ప్రతి ఒక్కరు 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని, ఎంత శుభ్రంగా ఉంటే కరోనాను అంత ధీటుగా ఎదుర్కోవచ్చునని’ తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.