Anushka Shetty : ఆ సినిమా సీక్వెల్‌లో.. లారెన్స్‌తో స్వీటీ..

అనుష్క శెట్టి, రాఘవ లారెన్స్ హీరో హీరోయిన్లుగా.. పి.వాసు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది..

Anushka Shetty : ఆ సినిమా సీక్వెల్‌లో.. లారెన్స్‌తో స్వీటీ..

Anushka Shetty

Updated On : September 19, 2021 / 4:38 PM IST

Anushka Shetty: స్టార్ హీరోయిన్ అనుష్క, పాపులర్ కొరియెగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో జతకట్టబోతోందనే వార్త మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత స్వీటీ కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వలేదు.

Anushka Shetty : బొద్దుగుమ్మలా అనుష్క.. బుగ్గలు బర్గర్‌లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. అంట..!

కట్ చేస్తే.. ఇప్పుడు రాఘవ లారెన్స్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి.వాసు తెరకెక్కించబోయే మూవీలో కథానాయికగా కన్ఫమ్ అయిందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి సీక్వెల్‌గా పి.వాసు కథ సిద్ధం చేశారట. లారెన్స్, పి.వాసు కలయికలో వచ్చిన ‘శివలింగ’ చిత్రం మంచి విజయం సాధించింది.

‘Ms. Shetty Mr. Polishetty’: అనుష్క శెట్టితో నవీన్ పోలిశెట్టి

వాసు ‘చంద్రముఖి’ తర్వాత ‘చంద్రముఖి 2’ చెయ్యాలనుకున్నారు కానీ రజినీ అందులో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ‘చంద్రముఖి’ ని ముందుగా కన్నడలో, విష్ణు వర్ధన్ ప్రధాన పాత్రలో ‘ఆప్తమిత్ర’ పేరుతో తీశారు. దానికి సీక్వెల్‌గా ‘ఆప్తరక్షక’ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నాగవల్లి’ గా రీమేక్ చేశారు.

Bigg Boss 5 Telugu : నింద వేసింది.. సారీ చెప్పి హగ్ ఇచ్చింది..