AP Film Chamber of Commerce : విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆఫీస్ ఓపెనింగ్..
సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రారంభించారు.

AP Film Chamber of Commerce New Office opened in Vijayawada by Suman
AP Film Chamber of Commerce : రాష్ట్ర విభజనానంతరం అన్ని డిపార్ట్మెంట్ లు కూడా రెండు భాగాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని యూనియన్స్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటూ సపరేట్ యూనియన్స్ మొదలుపెట్టారు. సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రారంభించారు.
కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తాజాగా విజయవాడ తాడేపల్లిలో ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసి సొంత ఆఫీస్ ని ఓపెన్ చేయడం విశేషం. సీనియర్ నటుడు సుమన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సొంత ఆఫీస్ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు మధు మోహన్ కృష్ణ, జనరల్ సెక్రటరీ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి, జాయింట్ సెక్రటరీ చైతన్య జంగా పాల్గొనగా ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నటుడు సుమన్ మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఖర్చులో షూటింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తే, అన్ని భాషల చిత్ర నిర్మాణ సంస్థలు ఆంధ్రా వైపు చూస్తాయి. ఈ దిశగా మధు, గౌడ్, వర్మ మరియు చైతన్య కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడేలా తమ ఛాంబర్ కృషి చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు అంబటి మధుమోహన్ కృష్ణ, మోహన్ గౌడ్ లు పేర్కొన్నారు. స్టూడియో నిర్మాణానికి మరియు నటులు, సాంకేతిక నిపుణులు మరియు ఫిలిం ఎంప్లాయిస్ కి స్థలాలు ఇవ్వడం, చిత్ర నిర్మాణానికి ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ తరహాలో ప్రోత్సాహం అందించడం ద్వారా హైదరాబాద్ కి సమాంతరంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటి, సంయుక్త కార్యదర్శి చైతన్య జంగా ప్రభుత్వానికి విన్నవించారు.
