Japan Jigarthanda : నేడు రిలీజయిన జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? హీరోలు అలా..
తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ డబ్బింగ్ తో థియేటర్స్ లో సందడి చేశాయి. ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.

Japan and Jigarthanda Double X Movies have some Similar Points
Japan Jigarthanda : నేడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చిన్నవే ఉండటంతో తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ డబ్బింగ్ తో థియేటర్స్ లో సందడి చేశాయి.
కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraj) దర్శకత్వంలో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమాతో పాటు హీరో కార్తి(Karthi) 25వ చిత్రంగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జపాన్’(Japan) సినిమా దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు కార్తీ, రాఘవ లారెన్స్ నెగిటివ్ పాత్రలే. చివర్లో వారిద్దరూ మంచిగా మారతారు. అంతే కాకుండా ఈ రెండు హీరో పాత్రలు కూడా సినిమా క్లైమాక్స్ లో చనిపోతాయి. దీంతో ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read : Samantha : బాబోయ్.. వరుస హాట్ ఫొటోషూట్స్‌తో రెచ్చిపోతున్న సమంత..
గతంలో హీరో చనిపోతారు అంటే ఆ సినిమాలు ఆడేవి కావు, అభిమానులు ఒప్పుకోరు అని హీరోలు కూడా ఆ పాత్రలు చేసే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు హీరోలు కొత్త తరహా పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తుండటంతో సినిమా చివర్లో చనిపోయే క్యారెక్టర్ అయినా చేస్తున్నారు. దీంతో కార్తీ, రాఘవ లారెన్స్ జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ సినిమాలో క్లైమాక్స్ లో మరణించే క్యారెక్టర్స్ చేసి మెప్పించారు. ఎంతైనా హీరోలు అలా చేయడానికి ఒప్పుకున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు.