Bharat Bhushan : ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి. భరత్ భూషణ్ ను నియమించింది ఏపీ ప్రభుత్వం. (Bharat Bhushan)
Bharat Bhushan
Bharat Bhushan : తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి. భరత్ భూషణ్ ను నియమించింది ఏపీ ప్రభుత్వం.
సినిమాలపై మక్కువతో 20 ఏళ్లుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు భరత్ భూషణ్. భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.
Also Read : Mothers Day : మదర్స్ డే స్పెషల్.. తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ స్పెషల్ ఫోటోలు చూశారా..?
ఇటీవలే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ ని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
