AR Rahman : ఏఆర్ రెహ్మాన్ కు ఛాతీ నొప్పి.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు..

ఇవాళ ఉదయం ఏ ఆర్ రహమన్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

AR Rahman : ఏఆర్ రెహ్మాన్ కు ఛాతీ నొప్పి.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు..

AR Rahman Joined in Chennai Hospital Fans Worried

Updated On : March 16, 2025 / 10:22 AM IST

AR Rahman : తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రహమాన్ తాజాగా నేడు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరినట్టు సమాచారం. ఛాతిలో నొప్పి రావడంతో ఇవాళ ఉదయం ఏ ఆర్ రహమన్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దీంతో ఏ ఆర్ రహమాన్ కి ఏమైంది, త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిన్నే రహమాన్ లండన్ నుంచి వచ్చారు. దీనిపై హాస్పిటల్ వర్గాలు స్పందిస్తూ.. AR రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉంది. కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని తెలిపారు.

Also Read : Devi Sri Prasad : పెద్ద డైరెక్టర్ నన్ను పిలిచి మ్యూజిక్ కాపీ చేయమన్నాడు.. నేను నో చెప్పి అలా అనేసరికి..

ఇప్పటికే ఆస్కార్ తో సహా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఏ ఆర్ రహమాన్ ఇప్పటికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే చావా సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఏ ఆర్ రహమాన్. కొన్ని నెలల క్రితమే తన భార్య సైరా భానుతో ఏ ఆర్ రహమాన్ విడాకులు తీసుకున్నారు.