Ram Charan : రామ్ చరణ్ RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయా.. ఫోటో వైరల్
ఏ ఆర్ రెహమాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ ని స్టార్ట్ చేసేశారా..?

AR Rahman starts music sittings of Ram Charan buchi babu RC16 movie
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే RC16 కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చరణ్ కూడా ఈ సినిమా కథ గురించి గొప్పగా మాట్లాడడంతో అభిమానుల్లో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి అదిరిపోయే కాస్టింగ్ క్రూని సెలెక్ట్ చేస్తుండడంతో ఆ అంచనాలు మరింత హీటెక్కుతున్నాయి.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. నేడు జనవరి 6న రెహమాన్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ మరియు చిత్ర యూనిట్ విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే నిర్మాతలు రెహమాన్ తో చిత్ర యూనిట్ ఉన్న ఫోటోలను చేశారు. ఆ ఫొటోల్లో దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబుతో పాటు నిర్మాతలు కనిపిస్తున్నారు.
Also read : Berlin Web Series Review : బెర్లిన్ వెబ్ సిరీస్ రివ్యూ.. ‘మనీ హైస్ట్’ అంత మెప్పించిందా..?
Happy Birthday @arrahman sir, wish you health and happiness always. pic.twitter.com/Lj6RPkIBNs
— Ram Charan (@AlwaysRamCharan) January 6, 2024
Extremely glad to have gotten a chance to work with you Sir ??
It’s a dream moment for me..
Tqq @arrahman sir ??❤️?@AlwaysRamCharan @aryasukku @vriddhicinemas @MythriOfficial @SukumarWritings pic.twitter.com/WNVhdBrtTL— BuchiBabuSana (@BuchiBabuSana) January 6, 2024
Wishing the Academy Winner, Padma Bhushan @arrahman Garu a very Happy Birthday ?❤️?
Honoured and elated to have you on board for #RC16 ?#RamCharanRevolts
Mega Power Star @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/34V6om3G2m— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2024
ఇక ఈ పిక్స్ చూసిన అభిమానులు.. సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యిపోయాయా..? అని ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ఫొటోలు చూస్తుంటే మ్యూజిక్ పనులు మొదలయ్యినట్లే తెలుస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో మొదలు పెట్టబోతున్నారు. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో శివరాజ్ కుమార్ స్వయంగా తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక రామ్ చరణ్ కి హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.