Theppa Samudram : బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి.. ‘తెప్పసముద్రం’ మూవీ కలెక్షన్స్ జోరు..
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో నటించిన ‘తెప్పసముద్రం’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు చూపిస్తుంది.

Arjun Ambati Chaitanya Rao Theppa Samudram Movie collections
Theppa Samudram : టీవీ సీరియల్స్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు అర్జున్ అంబటి.. గత బిగ్‌బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లి ఆడియన్స్ లో మంచి పాపులారిటీని అందుకున్నారు. కాగా ఈ నటుడు నటించిన ‘తెప్ప సముద్రం’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అర్జున్ తో పాటు చైతన్య రావు కూడా హీరోగా నటించిన ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా కనిపించగా రవి శంకర్ ముఖ్య పాత్రని చేసారు.
సతీష్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో థ్రిల్లింగ్ స్టోరీతో వచ్చిన ఈ చితం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంది. దీంతో రిలీజైన మూడురోజుల్లో రూ.2.25 కోట్ల వసూళ్లు చేసి అదుర్స్ అనిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు క్రిటిక్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి.
Also read : Faria Abdullah : ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా..?
ఇక ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరించినందుకు దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజుల, రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పెద్దపల్లి రోహిత్ ఈ సినిమాకి సంగీతం అందించారు.