Faria Abdullah : ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా..?
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా..? అది చూడడానికి చాలా డిఫరెంట్‌గా..

Faria Abdullah comments about her tattoo in Aa Okkati Adakku Trailer Launch event
Faria Abdullah : హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా నటించి టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యారు. ఆ తరువాత మెయిన్ లీడ్ రోల్స్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ స్క్రీన్ పై కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ హీరోయిన్ అల్లరి నరేష్ తో కలిసి ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని హీరో నాని చేతులు మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో ఒక సోషల్ మీడియా పర్సన్.. ఫరియా కాలు పై ఉన్న డిఫరెంట్ టాటూ గురించి ప్రశ్నించారు. చెట్టు ఏరుల రూపంతో ఆ టాటూ కనిపిస్తుంది. దాని అర్ధం ఏంటని ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ.. “ఈ టాటూ రూట్స్ (చెట్టు ఏరులు మాదిరి) అండి. నేను పర్సనల్ గా నమ్మేది ఏంటంటే.. ఏరులు ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత ఎత్తుకి ఎదగగలం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ టాటూ వేయించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఫరియా డిఫరెంట్ ఐడియా నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది.
Also read : Mahesh Babu : రాజమౌళి పర్మిషన్ లేకుండా.. మహేష్ లుక్ లీక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్..
ఇక ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా విషయానికి వస్తే.. పెళ్లి కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 3న రిలీజ్ కాబోతుంది. అల్లరి నరేష్ నుంచి చాలా గ్యాప్ తరువాత వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఇది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.