Mahesh Babu : రాజమౌళి పర్మిషన్ లేకుండా.. మహేష్ లుక్ లీక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్..

మహేష్ బాబు లుక్ రాజమౌళి పర్మిషన్ లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ లీక్ చేసారు.

Mahesh Babu : రాజమౌళి పర్మిషన్ లేకుండా.. మహేష్ లుక్ లీక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్..

Mahesh Babu photo with sunrisers hyderabad captain Pat Cummins

Updated On : April 22, 2024 / 7:02 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ ని కలుసుకున్నారు. మొన్నటివరకు వెకేషన్ లో ఉన్న మహేష్.. ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చారు. కాగా మహేష్ తన నెక్స్ట్ సినిమాని రాజమౌళితో చేస్తుండడంతో బయట పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా తలకి క్యాప్ పెట్టుకొని తన లుక్స్ ని కొంచెం కవర్ చేసుకుంటున్నారు.

కానీ మహేష్ బాబు లుక్ రాజమౌళి పర్మిషన్ లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ లీక్ చేసారు. మహేష్ రీసెంట్ గా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ ని కలుసుకున్నారు. వారితో కలిసి ఏదో ప్రమోషనల్ కంటెంట్ ని షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆ సమయంలో మహేష్ తో కలిసి పాట్ కమ్మిన్స్‌ ఒక ఫోటో తీసుకున్నారు.

Also read : Thalaivar 171 : రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది..కూలీగా సూపర్ స్టార్..

ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “టాలీవుడ్ ప్రిన్స్ ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టుకి మహేష్ బాబు రియాక్ట్ అవుతూ.. “నేను మీకు పెద్ద ఫ్యాన్. నేను నాకు దక్కిన గౌరవం” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం SSMB29కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ కి తీసుకు వెళ్తున్నారు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు.