Art director Milan : చిత్ర పరిశ్రమలో విషాదం.. షూటింగ్‌లో ఆర్ట్ డైరెక్టర్ మిలన్ గుండెపోటుతో మృతి.. విదేశాలకు వెళ్లి..
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డెరెక్టర్ మిలన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు.

Art director Milan passes away
Art director Milan passes away : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘విడా ముయూర్చి’. మగిజ్ తిరుమనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. త్రిష, రెజీనా హీరోయిన్లు కాగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పని చేస్తున్నారు. ఈ ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది.
ముందు రోజు రాత్రి షూటింగ్ తరువాత హోటల్‌కు చేరుకున్న మిలన్ సాధారణంగానే ఉన్నాడు. ఉదయం తన టీమ్‌ని పిలిచి మాట్లాడుతుండగా ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే సిబ్బంది అతడిని హోటల్ నుంచి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆర్ట్ డెరెక్టర్ మిలన్ హఠాన్మరణం పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు మిలన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Nandamuri Balakrishna Video: నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు?: బాలకృష్ణ ఫైర్
మిలన్ గతంలో అజిత్ హీరోగా నటించిన ‘బిల్లా’, ‘వేదాళం’, ‘వీరం’ చిత్రాలకు పని చేశాడు. మిలన్ మృతి చెందడంతో విడా ముయూర్చి షూటింగ్ వాయిదా పడింది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రానికి కూడా మిలన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.