Konchada Srinivas : షూటింగ్ లో ప్రమాదం.. సినీ నటుడు మృతి

ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో.... లాంటి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించిన కొంచాడ శ్రీనివాస్ షూటింగ్ లో ప్రమాదం సంభవించడంతో మరణించారు....

Konchada Srinivas : షూటింగ్ లో ప్రమాదం.. సినీ నటుడు మృతి

Srinivas

Updated On : January 20, 2022 / 9:34 AM IST

Konchada Srinivas :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో, అనారోగ్యంతో కొంతమంది నటి నటులు మరణించారు. తాజాగా మరో నటుడు మృతిచెందారు. ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో…. లాంటి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించిన కొంచాడ శ్రీనివాస్ షూటింగ్ లో ప్రమాదం సంభవించడంతో మరణించారు.

Naresh : బ్యానర్ స్థాపించి 50 ఏళ్ళు.. మళ్ళీ సినిమాలు నిర్మిస్తా..

శ్రీకాకుళం కాశీబుగ్గకి చెందిన కొంచాడ శ్రీనివాస్ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. ఇప్పటివరకు దాదాపు 40కి పైగా సినిమాలలో, 10కి పైగా సీరియల్స్ లో నటించారు. ఇటీవల సంక్రాంతికి ఇంటికి వెళ్లొచ్చాక ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ షూటింగ్ సమయంలో శ్రీను పై నుంచి కింద పడిపోవటంతో అతని ఛాతికి దెబ్బతగిలింది. అయితే అతనికి ముందునుంచి గుండెలో సమస్య ఉండటంతో ఛాతికి దెబ్బ తగిలడంతో ఆ సమస్య తీవ్రమై శ్రీను మరణించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.