Love Me Teaser : దెయ్యంతో రొమాన్స్ ఏంటిరా బాబు.. ‘లవ్ మీ’ టీజర్ రిలీజ్..

దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో దెయ్యం దగ్గరకి వెళ్లిన హీరో కథే 'లవ్ మీ'. టీజర్ చూసారా..

Love Me Teaser : దెయ్యంతో రొమాన్స్ ఏంటిరా బాబు.. ‘లవ్ మీ’ టీజర్ రిలీజ్..

Ashish Vaishnavi Chaitanya Love Me movie Teaser released

Updated On : March 7, 2024 / 5:03 PM IST

Love Me Teaser : టాలీవుడ్ యువ హీరో ఆశిష్, అందాల భామ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ‘లవ్ మీ’. ఇటీవల టైటిల్ అనౌన్స్‌మెంట్ తో దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే విషయాన్ని అర్ధమయ్యేలా చేసారు. ఇప్పుడు టీజర్ తో ఒక క్లారిటీ ఇచ్చేసారు. దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో హీరో.. దెయ్యం ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్ లోకి వెళ్తాడు. అక్కడ జరిగిన కథే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది.

Also read : Vijay Bulganin : బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్న డైరెక్టర్..

టీజర్ తోనే మూవీ మంచి బజ్ ని క్రియేట్ చేసారు. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, లవ్ అనే విషయాలు యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి థియేటర్స్ లో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. పిసి శ్రీరామ్ చూపించిన విజువల్స్ మూవీకి గ్రాండియర్ తీసుకువచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.