Vijay Bulganin : బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్న డైరెక్టర్..

తన బేబీ సినిమాకి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్న డైరెక్టర్ సాయి రాజేష్.

Vijay Bulganin : బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్న డైరెక్టర్..

sai rajesh said he didnt want to gave chance to Vijay Bulganin

Vijay Bulganin : ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎక్కువగానే కనిపిస్తుంది. కొందరు అప్ కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అదిరిపోయే సంగీతం అందించి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నప్పటికీ.. వారికీ ఎందుకో ఛాన్స్ లు పెద్దగా రావడం లేదు. ఈ వరసులోనే ‘బేబీ’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ‘విజయ్ బుల్గానిన్’ కూడా ఉన్నారు. బేబీ సినిమాకు ఈ సంగీత దర్శకుడు ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బేబీ మూవీ సక్సెస్ లో సగ భాగం సంగీతానిదే. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయినాసరి ఇండస్ట్రీలోని దర్శకులు విజయ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా బేబీ మూవీ డైరెక్టర్ కూడా.. విజయ్ బుల్గానిన్ కి ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్నారు. బేబీ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే.

Also read : Gal Gadot : నాలుగోసారి తల్లి అయిన ‘వండర్ ఉమెన్’..

ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ని తీసుకోవడం లేదని దర్శకుడు సాయి రాజేష్ తెలియజేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి రాజేష్ రైటింగ్స్ అండ్ నిర్మాణంలో కొన్ని లవ్ స్టోరీస్ తెరకెక్కుతున్నాయి, వీటిలో రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ కి అవకాశం ఇచ్చారు. అయితే ఆ రెండు చిత్రాలకు ఇప్పటివరకు రెండు సాంగ్స్ కూడా చేయలేదంట.

అందుకనే బాలీవుడ్ బేబీకి విజయ్ బుల్గానిన్ కి అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇక బేబీ రీమేక్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని యాక్టర్ గా లాంచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ని ఎంపిక చేసుకోబోతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీ హిందీ డైలాగ్స్ ని రాస్తున్నారట.