Ashu Reddy – Pawan Kalyan : పవన్ గారు పిలిచి టీ ఇచ్చి.. నేను అన్న మాటకు పడీ పడీ నవ్వారు.. వెళ్ళేటప్పుడు వార్నింగ్ కూడా.. అషురెడ్డి వ్యాఖ్యలు వైరల్..
తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ని మొదటి సారి కలిసినప్పుడు ఏం జరిగింది అని ఆసక్తికర విషయం తెలిపింది.

Ashu Reddy Interesting Comments on First Meet with Pawan Kalyan
Ashu Reddy – Pawan Kalyan : నటి, యాంకర్ అషురెడ్డి పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేరుని తన ఒంటి మీద టాటూ కూడా వేసుకుంది. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని పలుమార్లు చెప్పింది. పవన్ ని రెండు సార్లు కలిసింది కూడా. తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ని మొదటి సారి కలిసినప్పుడు ఏం జరిగింది అని ఆసక్తికర విషయం తెలిపింది.
అషురెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన పొలిటీషియన్ కాదు లీడర్. ఆయన బయట, సినిమాల్లో అలాగే ఉండి ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్లారు. ఆయనకు నేను భక్తురాలిని. ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసారు. నేను కూడా వేరే వాళ్లకు హెల్ప్ చేయడానికి ఆయనే కారణం. ఆయన హరిహర వీరమల్లు షూట్ జరుగుతున్నప్పుడు పక్క సెట్ లోనే నాది హ్యాపీ డేస్ షో షూట్ అవుతుంది. ఆయన్ని ఎలాగైనా కలవాలని ఫిక్స్ అయ్యాను. నా షూట్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు వెళ్లి కలుద్దామా అని ఎదురుచూస్తున్నాను. ఆ రోజు మిస్ అవ్వకూడదు, ఆయన మళ్ళీ ఎక్కడ దొరుకుతారు అని దండం పెట్టుకున్నాను.
Also Read : Good Bad Ugly : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ అదిరిందిగా..
నేను ఇంకో ఇద్దరం వెళ్ళాము. ఇలా మేము వచ్చాము పక్క సెట్ నుంచి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే రమ్మన్నారు. నన్ను చూసి నువ్వేనా నా పేరు టాటూ వేయించుకుంది అని అడగడంతో నేను గుర్తున్నానా అని ఆశ్చర్యపోయాను. ఆయన మమ్మల్ని పిలిచి కూర్చోపెట్టి టీ ఇచ్చారు. ఆయన టీ తాగుతున్నారు, నేను టీ పక్కన పెట్టేసి ఆయన్నే చూస్తున్నాను. మధ్యలో నేను సర్.. మీరు ఖుషి సినిమాలో భూమిక నడుము చూడటం నాకు నచ్చలేదు అన్నాను. అంతే పడీ పడీ నవ్వారు.
పవన్ కళ్యాణ్ గారి చేతి మీద త్రిశూలం టాటూ ఉంటుంది. దాన్ని చూడొచ్చా అని చెయ్యి పట్టుకున్నాను. నేను ఆయన్ని ఫ్లర్ట్ చేశాను ఓ రకంగా చెప్పాలంటే. ఆయన టీ తాగిన గ్లాస్ అడిగాను దాచుకుంటాను సర్ అని. ఆయన.. ఈ ఫోటోలు, గిఫ్ట్స్ కాదు ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్. నువ్వు ఎవర్నైనా కలిస్తే వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తుపెట్టుకో బాగుంటుంది అని అన్నారు. కలిసి వెంటనే పంపించేస్తారు అనుకున్నా కానీ రెండు గంటలు కూర్చోపెట్టి మాట్లాడారు. నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలని రాసి నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. వెళ్ళేటప్పుడు.. ప్రతిరోజు నేను ఈ మూడ్ లో ఉండను, ఈసారి కలిస్తే జాగ్రత్త అని సరదాగా వార్నింగ్ ఇచ్చారు అని తెలిపింది. దీంతో అషురెడ్డి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.