Atlee : హాలీవుడ్ నుంచి అట్లీకి కాల్ వచ్చిందట.. స్పానిష్‌లో తన నెక్స్ట్ మూవీ..

జవాన్ సినిమా తరువాత అట్లీకి హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందట. స్పానిష్‌లో తన నెక్స్ట్ మూవీ ఉంటుంది అంటూ..

Atlee : హాలీవుడ్ నుంచి అట్లీకి కాల్ వచ్చిందట.. స్పానిష్‌లో తన నెక్స్ట్ మూవీ..

Atlee recieved a call from hollywood after jawan success

Atlee : తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో ‘జవాన్’ వంటి యాక్షన్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ మూవీతో ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో అట్లీ పేరు కూడా వినించడం మొదలైంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమ నుంచి ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక మూవీ చేస్తున్నాడు. వరుణ్ ధావన్ తో ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో కూడా మూవీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Yatra 2 : యాత్ర 2 మొదలైంది.. సీఎం జగన్‌లా కనిపించబోతున్న జీవా.. వీడియో వైరల్..

అయితే ఈ దర్శకుడికి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ దీని గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. జవాన్ తరువాత తనకి హాలీవుడ్ నుంచి కాల్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తన నెక్స్ట్ మూవీ స్పానిష్ లో లో ఉంటుంది అంటూ వెల్లడించాడు. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. కాగా ఇటీవల మరో ఇంటర్వ్యూలో.. జవాన్ చిత్రాన్ని ఆస్కార్ కి తీసుకు వెళ్తాను అంటూ చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

Kamal Haasan : ఆ సమ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లు వ‌చ్చేవి

కాగా ప్రస్తుతం వరుణ్ ధావన్ తో చేస్తున్న సినిమా తమిళ్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. విజయ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న అట్లీ.. ఇప్పుడు వరుణ్ తో ఆ మూవీని మరోసారి తెరకెక్కించి బాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. కీర్తి సురేష్, వామికా గబ్బి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ మొదలైంది.