Sagileti Katha : ‘సగిలేటి కథ’ మూవీ నుంచి ‘అట్టా ఎట్టాగా’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ!

రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సగిలేటి కథ' చిత్రం నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. అట్టా ఎట్టాగా పుట్టేసినావు..

Sagileti Katha : ‘సగిలేటి కథ’ మూవీ నుంచి ‘అట్టా ఎట్టాగా’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ!

Atta Ettaga Lyrical song release from Sagileti Katha movie Ravi Mahadasyam

Updated On : August 30, 2023 / 2:42 PM IST

Sagileti Katha : రవి మహాదాస్యం (Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్‌ (Vishika Laxman) జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.

Kollywood : వారసులు అంతా కలిసి సినిమా చేయబోతున్నారా..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. ఈ సినిమాలోని ‘అట్టా ఎట్టాగా’ రెండొవ లిరికల్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ డిజిటల్ లాంచ్ చెయ్యగా, చిత్ర యూనిట్ కి విషెష్ తెలియజేసారు.

Bro Movie : ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో సందడి..

అట్టా ఎట్టాగా పుట్టేసినావు
నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు
సలికాలం సెగరేపే సలిమంటల్లాగా
నాలోన మంటేట్టినావే
ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా
నీదారే నాదంటూ దాహం తీర్చావే..!! అంటూ చక్కటి మెలోడీ అందించిన ఈ గీతాన్ని రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాశారు. యశ్వంత్ నాగ్ (పరేషాన్ మూవీ ఫెమ్), కమల మనోహరి ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు.

Allu Arjun : ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మొదటివాడట.. అది ఏంటో తెలుసా..?

సగిలేటి కథ సినిమాలో ప్రతి సాంగ్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా ‘అట్టా ఎట్టాగా’ సాంగ్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమలో పడే సన్నివేశంలో ఈ సాంగ్ మొదలవ్వుతుంది. ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలుపుతున్నారు. అలాగే, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సెరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.