Barabar Premistha : ఓటీటీలోకి వచ్చిన యాటిట్యూడ్ స్టార్ సినిమా..
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (Barabar Premistha)
Barabar Premistha
Barabar Premistha : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా తెరకెక్కిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇటీవల ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో బరాబర్ ప్రేమిస్తా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్లో మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్.. పలువురు కీలక పత్రాలు పోషించారు.
Also Read : Rukmini Vasanth : మదర్స్ డే.. తల్లితో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రుక్మిణి వసంత్.. ఫొటోలు..
ఓ ఊళ్ళో ఒకరంటే ఒకరు పడని రెండు కులాలు ఉంటాయి. ఆ కులాలకు చెందిన ఓ అమ్మాయి – అబ్బాయి ప్రేమించుకుంటే ఏం జరిగింది అని లవ్ కామెడీ కథాంశంతో పాటు ఊహించని క్లైమాక్స్ ట్విస్టులతో ఈ సినిమాని తెరకెక్కించారు.

