Big Boss 7 : బిగ్ బాస్ విన్నర్ అతనేనా? డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఎవరు?
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాల్ మరికొన్ని గంటల్లో మొదలవుతోంది. విన్నర్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విన్నర్‌తో పాటు హౌస్‌లో మిగిలిన వారు ఏయే స్ధానాల్లో ఉన్నారనేది బయట చర్చ జరుగుతోంది.

Big Boss 7
Big Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సీజన్ విజేత ఎవరన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హౌస్‌లో ఉన్న ఆరుగురిలో ఈ సీజన్ విజేత ఎవరు? ఎవరెవరు ఏ స్ధానంలో ఉన్నారనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Big Boss 7 Telugu Today Promo: బిగ్‌బాస్ ప్రశాంత్‌కి హగ్ ఇస్తానన్న శ్రీముఖి.. ఎందుకు?
బిగ్ బాస్ సీజన్ 7 బాగానే ఆకట్టుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‌లో ఒక్కొక్కరు ఎలిమినేట్ కాగా గ్రాండ్ ఫినాలేకి హౌస్‌లో ఆరుగురు సభ్యులు మిగిలారు. వీరిలో ఎవరు విన్నర్? ఎవరు రన్నర్? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రతి సీజన్ లాగనే హౌస్‌లో ఈ ఏడాది కంటెస్టెంట్స్ బాగానే సందడి చేసారు. స్నేహం, ప్రేమ, అరుచుకోవడాలు, టాస్క్‌లు , యుద్ధాలు, ఎమోషన్స్‌తో హౌస్ దద్దరిల్లిపోయింది. అన్నింటిని తట్టుకుని చివరి వరకు ఆరుగురు మాత్రమే మిగిలారు.
Bigg Boss 7 Day 101 : చరిత్ర సృష్టిస్తా అంటున్న యావర్.. పుష్పలా ఎదిగిన పల్లవి ప్రశాంత్..
బిగ్ బాస్ 7 సీజన్ విజేత అమర్ దీప్ అంటూ బయట టాక్ వినిపిస్తోంది. రన్నర్ ప్రశాంత్ అని థర్డ్ ప్లేస్ శివాజీ దక్కించుకోగా, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న యావర్ రూ.15 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో ప్రియాంక జైన్, సిక్త్ ప్లేస్ అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బయట చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ఇందులో నిజం ఉండొచ్చు.. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో చివరి క్షణంలో ఏదైనా ఉల్టా కావచ్చు. కాగా గ్రాండ్ ఫినాలేకి మాత్రం బిగ్ బాస్ టీమ్ అదిరిపోయే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ షోలో సందడి చేస్తున్నట్లు సమాచారం.