Bigg Boss 7 Day 101 : చరిత్ర సృష్టిస్తా అంటున్న యావర్.. పుష్పలా ఎదిగిన పల్లవి ప్రశాంత్‌..

ఎమోషనల్ జర్నీ ఎపిసోడ్స్ జరుగుతున్న బిగ్‌బాస్ 7 బుధవారం ఎపిసోడ్‌లో.. యావర్, పల్లవి ప్రశాంత్‌ జర్నీ వీడియోస్ ని చూపించారు.

Bigg Boss 7 Day 101 : చరిత్ర సృష్టిస్తా అంటున్న యావర్.. పుష్పలా ఎదిగిన పల్లవి ప్రశాంత్‌..

Bigg Boss 7 Day 101 episode highlights Prince Yawar Pallavi Prashanth journey videos

Updated On : December 14, 2023 / 6:58 AM IST

Bigg Boss 7 Day 101 : బిగ్‌బాస్ 7 ఫైనల్ వీక్ రన్ అవుతుంది. ఈ సీజన్ లో అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, శివాజీ, ప్రశాంత్, యావర్‌లు ఫైనల్‌కి వచ్చారు. ఇక ఈ చివరి వారం నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా ఎమోషనల్ గా సాగుతుంది. ఫైనల్స్ కి చేరుకున్న ఒక్కొక కంటెస్టెంట్ జర్నీని చూపిస్తూ ఎపిసోడ్స్ సాగుతున్నాయి. సోమవారం ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించిన బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంకల జర్నీని చూపించారు.

ఇక నిన్న బుధవారం ఎపిసోడ్ లో యావర్, పల్లవి ప్రశాంత్‌ జర్నీ వీడియోస్ ని చూపించారు. మొదటి యావర్ కి సంబంధించిన జర్నీ వీడియోని చూపించారు. తనకి సంబంధించిన ఏవి చూసిన యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తను కొల్‌కత్తాకి చెందిన వాడో, తెలుగు వాడినో కాదు. మీ అందర్నీ వాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన తనని బిగ్‌బాస్ ఎలా మార్చిందో గుర్తు చేసుకున్నారు. ఈ సీజన్ లో టైటిల్ కప్ అందుకొని చరిత్ర సృష్టిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ సీజన్ లో తాను విన్నర్ అయితే.. సహాయం కోసం చూస్తున్న వారికీ హెల్ప్ చేస్తానని పేర్కొన్నారు.

Also read : Harish Shankar : పవన్ మూవీ పక్కన పెట్టేసి… రవితేజతో సినిమా అనౌన్స్ చేసిన హరీష్ శంకర్..

అనంతరం పల్లవి ప్రశాంత్ గురించిన ఏవి చూపించారు. ఒక కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ అనే ట్యాగ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పుష్పలా ఎదిగాడని చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్. ఆ ఏవి చూసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్.. రైతు గర్వపడేలా చేస్తాను అంటూ మాట ఇచ్చారు. నిన్నటితో జర్నీకి సంబంధించిన ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. కాగా ఈ సీజన్ లో ఎవరు కప్పు కొడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి కామన్ మ్యాన్ అయిన ప్రశాంత్ టైటిల్ కప్ కొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక అతడికి పోటీగా శివాజీ ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ సీజన్ కి ఎవరు గెస్ట్‌గా రాబోతున్నారో అని ఆసక్తి నెలకుంది.