Avengers హీరో: సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులు

ప్రముఖ యాక్షన్ హీరో.. ఎవేంజర్స్ సినిమాలో సూపర్ హీరో అయిన జెరెమీ రెన్నర్. భుజానికి బాణాలు తగిలించుకుని రాకెట్ వంటి వేగంతో ఫైట్ చేసి అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. ఇదంతా సినిమా వరకే. నిజ జీవితంలో నోట్లో తుపాకీ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగి కోర్టు మెట్లక్కాడు.
48ఏళ్ల జెరెమీ ఆల్కహాల్ తీసుకుని డ్రగ్స్‌తో మత్తులో మునిగిపోయాడు. తన ఆరేళ్ల కూతురు నిద్రపోతున్న గదిలో తుపాకీ తీసుకుని సీలింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో తన మాజీ భార్య సోన్నీ పచావో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్లో గన్ పెట్టుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడంటూ కంప్లైంట్‌లో పేర్కొంది.