Umapathi Review : అవికా గోర్ నిర్మాతగా, హీరోయిన్‌గా చేసిన ‘ఉమాపతి’ సినిమా రివ్యూ..

అనురాగ్, అవికా గోర్ జంటగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కే.కోటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'ఉమాపతి'. ఈ సినిమా నేడు డిసెంబర్ 29న థియేటర్స్ లో రిలీజయింది.

Umapathi Review : అవికా గోర్ నిర్మాతగా, హీరోయిన్‌గా చేసిన ‘ఉమాపతి’ సినిమా రివ్యూ..

Avika Gor Anurag Umapathi Movie Review and Rating

Umapathi Movie Review : చిన్నప్పటి నుంచే సీరియల్స్, సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అవికా గోర్(Avika Gor) ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే వధువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించింది. తాజాగా ఉమాపతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది అవికా. ఈ సినిమాకి అవికా కూడా నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అనురాగ్(Anurag), అవికా గోర్ జంటగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కే.కోటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఉమాపతి’. ఈ సినిమా నేడు డిసెంబర్ 29న థియేటర్స్ లో రిలీజయింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘కలవాని’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఉమాపతి. ఫిదా మూవీకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి.. పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాల్లో ఉన్న కొత్తపల్లి ఊర్లో వర ప్రసాద్(అనురాగ్) కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి జులాయిగా తిరుగుతూ ఉంటాడు. తండ్రి దుబాయ్ లో కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తుంటే వర ఇక్కడ జల్సాలు చేస్తూ ఉంటాడు. దోసకాయలపల్లి అనే ఊర్లో ఉండే ఉమాదేవి(అవికా గోర్) కాలేజీ చదువుకుంటూ ఉంటుంది. ఈ రెండు ఊళ్లకు ఎంతో కాలంగా గొడవలు ఉన్నాయి. వర.. ఉమాని ప్రేమించి ఆమె వెంటపడతాడు. ఉమా కూడా వరని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక ఉమా వాళ్ళ అన్నయ్య రుద్రకి, వరకు కూడా పాత గొడవలు ఉంటాయి. ఓ సారి వర, అతని ఫ్రెండ్స్ బాగా తాగేసి వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకతను లవ్ చేశాడని రుద్ర మరదలిని కిడ్నాప్ చేస్తారు. దీంతో రుద్ర, అతని మనుషులు వీరిని వెంబడిస్తారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి వర వాళ్ళ నాన్న దిగుతాడు. కొడుకు ఇలా జులాయిగా తిరగడం చూసి వర వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? వర తన వదినని కిడ్నప్ చేసాడని తెలిసి ఉమా ఏం చేస్తుంది? వీరి ప్రేమ ఏమైంది? రుద్ర వరని ఏం చేసాడు? రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

నటీనటుల విషయానికొస్తే.. అనురాగ్ కొత్త నటుడైనా అన్ని సన్నివేశాల్లోను పర్వాలేదనిపించాడు. అవికా గోర్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలా మెప్పించింది. పోసాని మురళీకృష్ణ, హీరో ఫ్రెండ్స్ గా చేసిన ప్రవీణ్, రామ్ ప్రసాద్.. మరికొంతమంది తమ కామెడీతో మెప్పిస్తారు. విలన్ గా నటించిన రుద్ర పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. హీరో తల్లితండ్రుల పాత్రల్లో శివన్నారాయణ, తులసి మెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ గా సాగగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా మారుతుంది.

Also Read : Devil Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ.. దేశభక్తితో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా..

సాంకేతిక అంశాలు.. సినిమా అంత గోదావరి జిల్లాల్లో పల్లెటూరు వాతావరణంలో షూట్ చేయడంతో అందమైన లొకేషన్స్ చూపించి అక్కడ కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా చూపించారు. పాటలు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపిస్తాయి. మాములు ప్రేమ కథనం అయినా గ్రామీణ నేపథ్యంలో గొడవలు అంటూ కొత్తగానే చూపించారు.అక్కడక్కడా కథనంలో మాత్రం కొంచెం సాగతీత కనిపిస్తుంది.

మొత్తంగా ఉమాపతి ఓ పల్లెటూరి ప్రేమకథలా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ సినిమాకు 2.5 వరకు రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.