Avinash : పెళ్లికొడుకయిన బిగ్ బాస్ కంటెస్టెంట్
మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలే అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం అయింది.
Avinash : జబర్దస్త్ షోలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి, టీం లీడర్ గా ఎదిగి తన కామెడీతో అందర్నీ నవ్వించి, గత సీజన్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎంటర్ అయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అవినాష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో తన పరఫార్మెన్స్ తో అందర్నీ నవ్విస్తున్న ఈ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలే అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం అయింది. ఆ అమ్మాయిని టీవీ షోకి కూడా తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. అవినాష్ మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
Bigg Boss 5 : ఈ సారి నామినేషన్స్‌లో వీళ్లేనా??
ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. నిన్న అవినాష్ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు టీవీ నటులు, నెటిజన్లు అవినాష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్ళికి జబర్దస్త్ తో పాటు మరి కొంతమంది టీవీ నటులు వచ్చే అవకాశం ఉంది.